చిక్కుల్లో చంద్రబాబు.. అరెస్టు తప్పదా !
అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబుకు కష్టాలు తప్పేలా లేవు.. పక్కా ఆధారాలతోనే వైసీపీ సర్కార్ చంద్రబాబు కు ఉచ్చు బిగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.. ఏ క్షణంలోనైనా ఈ నెల 23 తర్వాత చంద్రబాబు అరెస్టు అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు కోడై కూస్తున్నాయి.. అమరావతి రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. చంద్రబాబు నాయుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు చేసింది 23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడీ ఆఫీసుకు రావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్ 41A(3)కింద అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అవసరమైన డాక్యుమెంట్లతో రావాలని సూచించిన సీఐడీ అధికారులు.. విచారణకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదదని నోటీసుల్లో వెల్లడించారు. సాక్ష్యులను బెదిరించకూడదని, వారిని సంప్రదించకూడదని సూచించారు. సాక్ష్యాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు చెయ్యరాదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది
ఈ వ్యవహారంలో చంద్రబాబు న్యాయవాదులతో చర్చిస్తున్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. సీఐడీ నోటీసులపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు న్యాయ నిపుణులు. మార్చి 23న సీఐడీ విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ , ప్రతిపాటి పుల్లారావుకు నోటీసులు జారీ చేసింది.
మొత్తానికి అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందా.. లేక ఆయన బయటపడతారో చూడాలి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .. ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఇక్కడ వరకు వచ్చింది..

Comments
Post a Comment